భారతదేశం, డిసెంబర్ 30 -- న్యూ ఇయర్ వేడుకల కోసం హైదరాబాద్ నగరం రెడీ అయింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ మెట్రో కూడా అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేసింది. డిసెంబర్ 31వ తేదీన మెట్రో రైలు సర్వీసుల సమయం పొడిగిస్తున్నట్టుగా ఎల్అండ్‌టీ హైదరాబాద్ మెట్రో రైలు ప్రకటించింది. సాధారణంగా రాత్రి 11 గంటల వరకు చివరి మెట్రో రైలు నడుస్తుంది. కానీ డిసెంబర్ 31వ తేదీన అర్ధరాత్రి ఒంటి గంట వరకు మెట్రో రైలు సర్వీసులు నడుస్తాయి. ప్రారంభ స్టేషన్ల నుంచి రాత్రి ఒంటి గంటకు చివరి రైలు బయలుదేరుతుంది. ప్రయాణికులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మెట్రో తెలిపింది. పోలీసుల నిఘా ఉంటుందని వెల్లడించింది.

అయితే హైదరాబాద్ మెట్రోలో మద్యం తీసుకెళ్లవచ్చా అనే సందేహం చాలా మందికి ఉంది. దీనిపై ఆరా తీస్తున్నారు. నిజానికి హైదరాబాద్ మెట్రో ప్రయాణికుల భద్రతాకు చాలా...