భారతదేశం, డిసెంబర్ 30 -- నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో ఉంచుకుని డిసెంబర్ 31, 2025, జనవరి 1, 2026 తేదీలలో రాష్ట్రవ్యాప్తంగా మద్యం అమ్మకాల సమయాలను పొడిగించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఉత్తర్వుల ప్రకారం, మద్యం రిటైల్ దుకాణాలు రాత్రి 12 గంటల వరకు మద్యం విక్రయించడానికి అనుమతి ఉంటుంది, బార్లు తెల్లవారుజామున 1 గంట వరకు మద్యం అందించడానికి అనుమతి ఇచ్చింది ప్రభుత్వం.

డిసెంబర్ 31, 2025, జనవరి 1, 2026 తేదీలలో ఏ4 మద్యం దుకాణాలు అర్ధరాత్రి 12 గంటల వరకు పనిచేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని రెవెన్యూ (ఎక్సైజ్) శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్ ఒక ఉత్తర్వు జారీ చేశారు. ఇంకా 2బీ లైసెన్స్‌లు కలిగి ఉన్న బార్‌లు, ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సీ1 (ఇన్-హౌస్) లైసెన్స్‌లు, ఈపీ1 (ఈవెంట్ పర్మిట్) లైసెన్స్‌లు, టీడీ1...