భారతదేశం, జనవరి 4 -- బాలీవుడ్ లవ్లీ కపుల్ దీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్ కొత్త ఏడాదికి గ్రాండ్ వెల్‌కమ్ చెబుతున్నారు. ప్రస్తుతం ఈ జంట అమెరికాలోని న్యూయార్క్ నగరంలో విహరిస్తోంది. శుక్రవారం (జనవరి 2) రాత్రి అక్కడి ప్రసిద్ధ మేడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో జరిగిన ఎన్‌బీఏ (NBA) బాస్కెట్‌బాల్ మ్యాచ్‌కి డేట్ నైట్‌లో భాగంగా వెళ్లిన దీపిక-రణ్‌వీర్ ప్రత్యక్షంగా వీక్షించారు.

న్యూయార్క్ నిక్స్, అట్లాంటా హాక్స్ జట్ల మధ్య జరిగిన బాస్కెట్‌బాల్ హోరాహోరీ పోరును దీపికా, రణ్‌వీర్ ఆస్వాదించారు. అక్కడ ఉన్న కొందరు భారతీయ అభిమానులు ఈ జంటను గుర్తించి ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

దీపికా బ్లాక్ లెదర్ జాకెట్, స్మోకీ ఐస్ లుక్‌లో ఎంతో స్టైలిష్‌గా కనిపించగా, రణ్‌వీర్ బ్లాక్ కోట్, బీనీ క్యాప్‌తో తనదైన ఫ్యాషన్ టేస్ట్‌ను చాటుకున్నారు. అయితే, వీరి గారాల ప...