భారతదేశం, జనవరి 5 -- న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను చెప్పడానికి వీలవుతుంది. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి ప్రవర్తన, తీరు ఎలా ఉంటుందనేది చెప్పడంతో పాటు భవిష్యత్తు గురించి కూడా చాలా విషయాలను చెప్పవచ్చు. అలాగే కొన్ని తేదీల్లో పుట్టిన వారికి కొన్ని బలాలు ఉంటే, అదే కొన్ని తేదీల్లో పుట్టిన వారికి అవే బలహీనతలు కావచ్చు.

సంఖ్యాశాస్త్రం ప్రకారంగా చూసినట్లయితే, ఒక్కో సంఖ్యకు ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది. మొత్తం ఒకటి నుంచి తొమ్మిది వరకు రాడిక్స్ సంఖ్యలు ఉంటాయి. ఈ సంఖ్యల ఆధారంగా ప్రతి ఒక్కరి గురించి తెలుసుకోవచ్చు. ఈ రోజు సంఖ్యాశాస్త్రం ప్రకారం రాడిక్స్ నెంబర్ 5 వారి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.

ఏదైనా నెలలో 5, 14, 23 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య 5 అవుతుంది. ఈ సంఖ్యకు అధిపతి బుధుడు. జ్యోతిష్యశాస్త్రంలో బుధుడు తెలివైన, చ...