భారతదేశం, డిసెంబర్ 29 -- అమెరికాలోని న్యూజెర్సీలో ఆదివారం మధ్యాహ్నం ఒక భారీ ప్రమాదం సంభవించింది. రెండు హెలికాప్టర్లు గాలిలో ఉండగానే ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒక పైలట్ ప్రాణాలు కోల్పోగా, మరో పైలట్ ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హేమన్టన్ మున్సిపల్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది.

ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్థానికంగా ఉన్న ఒక స్టోర్ పార్కింగ్ లాట్ నుంచి తీసిన వీడియోలో.. ఒక హెలికాప్టర్ గాలిలో నియంత్రణ కోల్పోయి వేగంగా గిరగిర తిరుగుతూ నేలకూలడం కనిపిస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలంలో దట్టమైన నల్లటి పొగలు కమ్ముకున్నాయి. హెలికాప్టర్ శిథిలాలు మంటల్లో చిక్కుకున్న దృశ్యాలు చూస్తుంటే ప్రమాద తీవ్రత ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

"ఒక హెలికాప్టర్ పూర్తిగా మంటల్లో...