భారతదేశం, జనవరి 20 -- భారత జట్టులోకి తిరిగి రావడానికి ఇషాన్ కిషన్ చేసిన నిరీక్షణ ఫలించింది. దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ టీమిండియా జెర్సీలో మైదానంలోకి దిగడానికి రంగం సిద్ధమైంది. నాగ్‌పూర్ వేదికగా బుధవారం (జనవరి 21) న్యూజిలాండ్‌తో జరగనున్న మొదటి టీ20 మ్యాచ్‌ తుది జట్టులో ఇషాన్ కిషన్ ఉంటాడని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మంగళవారం ధృవీకరించాడు.

యువ ఆటగాడు తిలక్ వర్మ పొత్తికడుపు శస్త్రచికిత్స కారణంగా మొదటి మూడు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. దీంతో అతని స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారన్న ప్రశ్నకు సూర్య సమాధానం ఇచ్చాడు. జట్టులో శ్రేయస్ అయ్యర్ ఉన్నప్పటికీ, మేనేజ్‌మెంట్ ఇషాన్‌ వైపే మొగ్గు చూపింది.

"ఇషాన్ కిషన్ నంబర్ 3లో బ్యాటింగ్ చేస్తాడు. మేం అతన్ని వరల్డ్ కప్ జట్టు కోసం ఎంపిక చేశాం. అతను చాలా కాలంగా జట్టుకు ఆడలేదు కాబట్టి ఇప్పుడు అవకాశం ఇవ్వడం సరైన నిర్...