భారతదేశం, సెప్టెంబర్ 6 -- భారతీయ విద్యార్థులను ఆకట్టుకోవడానికి భారీ స్కాలర్‌షిప్‌లను ప్రకటించింది న్యూజిలాండ్‌లోని ప్రతిష్టాత్మక ఒటాగో విశ్వవిద్యాలయం. విద్యాపరంగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచే వారికి, ఎన్​జెడ్​డీ 15,000 డాలర్ల (సుమారు రూ. 7.76 లక్షలు) నుంచి ఎన్​జెడ్​డీ 45,000 డాలర్ల (సుమారు రూ. 23.4 లక్షలు) వరకు స్కాలర్‌షిప్‌లు అందించనున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా, మొదటి సంవత్సరం రెసిడెన్షియల్ కాలేజీ వసతిని కూడా ఈ స్కాలర్‌షిప్‌లో భాగంగా అందిస్తున్నట్టు వివరించింది.

న్యూజిలాండ్‌లోని అంతర్జాతీయ విద్యార్థుల్లో 11% భారతీయ విద్యార్థులే ఉన్నారు. గత ఏడాది భారతీయ విద్యార్థుల నమోదులో 34% వృద్ధి కనిపించినట్టు ఆ దేశ జాతీయ గణాంకాలు తెలుపుతున్నాయి. ఒటాగో విశ్వవిద్యాలయంలో కూడా 2024లో భారతీయ విద్యార్థుల నమోదు 45% పెరిగింది.

భారతీయ విద్యార్థుల కోసం ఒటా...