భారతదేశం, ఏప్రిల్ 23 -- కర్ణాటక రాష్ట్రంలోని కైగా వద్ద 700 మెగావాట్స్ ఎలక్ట్రిక్ సామర్థ్యం కలిగిన రెండు అణు రియాక్టర్ యూనిట్ల నిర్మాణానికి పర్చేజ్ ఆర్డర్ ను మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) బుధవారం అందుకుంది. ముంబయిలో బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐఎల్) సీనియర్ అధికారుల నుంచి పర్చేజ్ ఆర్డర్ ను ఎంఈఐఎల్ డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) సి.హెచ్. సుబ్బయ్య అందుకున్నారు.

కైగా యూనిట్లు 5, 6 అణు రియాక్టర్లను ఎన్పీసీఐఎల్ కోసం ఎంఈఐఎల్ నిర్మించనుంది. రూ.12,800 కోట్లతో రెండు అణు రియాక్టర్లన ఎంఈఐఎల్ నిర్మించనుంది.

ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ (ఈపీసీ) విధానంలో ఎంఈఐఎల్ ఈ అణు రియాక్టర్ల నిర్మాణాన్ని చేపట్టనుంది. ఇప్పటి వరకు ఎన్పీసీఐఎల్ ఏకమొత్తంగా ఇచ్చిన అతిపెద్ద ఆర్డర్ ...