భారతదేశం, డిసెంబర్ 17 -- మరికొన్నిరోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. చాలా మంది కూడా రకరకాల ట్రిప్స్ ప్లాన్ చేస్తుంటారు..! మరికొందరైతే నూతన సంవత్సరంలో అంతా మంచి జరగాలని కోరుకుంటూ అధ్యాత్మిక ప్రాంతాలకు వెళ్తుంటారు. అయితే తమిళనాడులోని అరుణాచళేశ్వరుడిని దర్శించుకునేందుకు ఐఆర్సీటీసీ టూరిజం ప్యాకేజీని ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 2వ తేదీన జర్నీ ఉంటుందని పేర్కొంది.

గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది భక్తులు అరుణాచలం వెళ్తున్నారు. అంతేకాకుండా గిరిప్రదక్షిణ చేసే వారి సంఖ్య పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఐఆర్‌సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర పేరుతో టూర్ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది. ఒకవేళ మీరు హైదరాబాద్ నుంచి వెళ్లాలి అనుకుంటే ఈ స్పెషల్ ప్యాకేజీని ఉపయోగించుకోవచ్చు. ఈ ప్యాకేజీలో భాగంగాఅరుణాచలం మాత్రమే కాదు పుదుచ్చేరి, లకాంచీపురం కూడా చూడొచ్చు. http...