భారతదేశం, డిసెంబర్ 27 -- గ్రహాలు కాలానుగుణంగా వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వచ్చినప్పుడు, అది అన్ని రాశుల వారి జీవితంలో అనేక మార్పులు తీసుకొస్తుంది. మరి కొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతోంది. జనవరి 1న, న్యూఇయర్ మొదటి రోజు చంద్రుడు వృషభ రాశిలో సంచారం చేస్తాడు. అలాగే రోహిణి నక్షత్రంలో ఉంటాడు. దీంతో కొన్ని రాశులకు ఈ చంద్రసంచారం కలిసి రాబోతోంది. చంద్రసంచారంతో ఈ రాశుల వారికి అనేక విధాలుగా లాభాలు కలుగుతాయి.

చంద్రుడు రెండు లేదా మూడు రోజులకు ఒకసారి తన రాశిని మారుస్తూ ఉంటాడు. చంద్రుని సంచారంలో మార్పు వచ్చినప్పుడు, అది అన్ని రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకువస్తుంది. కొన్నిసార్లు శుభ ఫలితాలు ఎదురైతే, కొన్ని సార్లు అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

వృషభ రాశి వారికి చంద్ర సంచారం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ ర...