భారతదేశం, నవంబర్ 23 -- తెలుగులో పాపులర్ నటీమణుల్లో హేమ ఒకరు. ఎన్నో సినిమాల్లో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హేమ. నువ్వు నాకు నచ్చావ్, అతడు, జులాయి వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో తన కామెడీతో అలరించిన హేమపై గతంలో రేవ్ పార్టీ అభియోగాలు వచ్చిన విషయం తెలిసిందే.

ఓ రేవ్ పార్టీలో హేమ దొరికినట్లు మీడియాలో కథనాలు చాలా వచ్చాయి. ఈ న్యూస్ అప్పట్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఆ రేవు పార్టీ కేసు కోర్టు వరకు వెళ్లింది. అయితే, ఆ రేవు పార్టీలో తాను లేనని, అనవసరంగా తనపై కథనాలు ప్రచురిస్తున్నారని అప్పట్లోనే చెప్పుకొచ్చారు హేమ.

తాజాగా ఆ రేవ్ పార్టీ కేసుపై కోర్టులో తుది నిర్ణయం వచ్చింది. ఈ సందర్భంగా నటి హేమ ఎమోషనల్ వీడియోను పంచుకున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో హేమ కన్నీటిపర్యంతం అయ్యారు.

"అందరికి నమస్కారం నేనే మీ హేమ. రేవ్ ప...