భారతదేశం, జనవరి 21 -- మహారాష్ట్రలో అన్నదాతలు మరోసారి పోరుబాట పట్టారు. చారోటి నుంచి పాల్ఘర్ వరకు సుమారు 45 కిలోమీటర్ల మేర సీపీఎం ఆధ్వర్యంలో సాగిన 'లాంగ్ మార్చ్' మంగళవారం సాయంత్రం పాల్ఘర్ కలెక్టరేట్‌కు చేరుకుంది. సుమారు 10 వేల మందికి పైగా రైతులు, ఆదివాసీలు, మత్స్యకారులు ఈ పాదయాత్రలో పాల్గొని తమ నిరసన గళాన్ని వినిపించారు.

రైతులు, ఆదివాసీల చిరకాల వాంఛలైన 12 కీలక డిమాండ్ల సాధన కోసం ఈ యాత్ర సాగింది. అందులో ముఖ్యమైనవి:

"ప్రభుత్వం నుంచి లిఖితపూర్వక హామీ లభించే వరకు మేము ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. ప్రభుత్వం ఇప్పటికీ మొండివైఖరి ప్రదర్శిస్తే రైలు రోకో లేదా ముంబైలోని మంత్రాలయాన్ని ముట్టడిస్తాం" అని సీపీఎం అగ్రనేత అశోక్ ధావలే హెచ్చరించారు. గతంలో 2018, 2023లో జరిగిన లాంగ్ మార్చ్‌ల సందర్భంగా ఇచ్చిన హామీలు నేటికీ అమలుకు నోచుకోకపోవడంతో ప్రజలు తీవ...