Hyderabad, జనవరి 31 -- ఆరోగ్యం బాగోలేనప్పుడు నోరు చప్పగా అనిపిస్తుంది. అలాగే వాతావరణం చల్లగా ఉన్నా కూడా ఏదైనా స్పైసీగా తినాలనిపిస్తుంది. అలాంటి వారికి ఆరోగ్యకరమైన వెల్లుల్లి పచ్చడి ఇచ్చాము. దీన్ని అప్పటికప్పుడే ఐదు నిమిషాల్లో చేసేసుకోవచ్చు. పైగా ఇది ఎంతో రుచిగా ఉంటుంది. అన్నంలో కలుపుకుని తింటే అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి దీన్ని ట్రై చేసి చూడండి. మీకు కచ్చితంగా నచ్చుతుంది. దీన్ని వండడానికి పెద్దగా కష్టపడక్కర్లేదు. ఇక రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

వెల్లుల్లి రెబ్బలు - 10

ఎండుమిర్చి - ఆరు

ఉల్లిపాయ - ఒకటి

ఉప్పు - రుచి సరిపడా

కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు

పసుపు - పావు స్పూను

1. వెల్లుల్లి పచ్చడి తయారు చేసేందుకు స్టవ్ మీద కళాయి పెట్టి ఒక స్పూను నూనె వేయాలి.

2. ఆ నూనెలో ఎండుమిర్చిని వేసి నలుపుగా అయ్యేవరకు వేయించుకోవాలి. వాటిని తీసి పక్కన ...