భారతదేశం, జూలై 9 -- ఇటీవల కాలంలో నోబెల్ శాంతి బహుమతిని బహిరంగంగా కోరుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. అంతర్జాతీయంగా యుద్ధాలను నివారించి, శాంతి నెలకొనేలా చేసినందుకు తనకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే పలుమార్లు డిమాండ్ చేశారు. ఇప్పుడు తాజాగా ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా తనకు నోబెల్ బహుమతి ఇవ్వాలని కోరారు.

కేంద్రం నియమించిన లెఫ్టినెంట్ గవర్నర్ తనను ఎన్నో ఇబ్బందులు పెట్టినప్పటికీ ఢిల్లీలో ఎంతో ప్రజా సేవ చేశానని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. అందుకుగానూ తనకు నోబెల్ బహుమతి ఇవ్వాలని వ్యాఖ్యానించారు. ఆప్ సీనియర్ నేత జాస్మిన్ షా రచించిన 'కేజ్రీవాల్ మోడల్' పుస్తకం పంజాబీ వెర్షన్ ఆవిష్కరణ సందర్భంగా మొహాలీలో ఆయన మాట్లాడారు. "ఢిల్లీలో ...