భారతదేశం, జనవరి 16 -- 2025లో నోబెల్​ శాంతి బహుమతిని అందుకున్న వెనెజువెలా ప్రతిపక్ష నేత కోరినా మచాడో, ఆ మెడల్​ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​కి ఇచ్చారు. ఆ బహుమతిని స్వీకరిస్తున్నట్టు ట్రంప్ సైతం​ ప్రకటించారు. ఈ నేపథ్యంలో తమకు అందిన నోబెల్​ శాంతి బహుమతులను వేరొకరికి ఇవ్వొచ్చా? అన్న సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. దీనిపై నోబెల్​ కమిటీ స్పందించింది.

వెనెజువెలా దేశ ప్రతిపక్ష నాయకురాలు, కోరినా మచాడో గురువారం వాషింగ్టన్‌లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆమె తనకు లభించిన నోబెల్ శాంతి బహుమతి మెడల్‌ను ట్రంప్‌నకు బహుకరించారు.

"చరిత్రలో రెండు వందల ఏళ్ల తర్వాత, బొలివర్ వారసులు వాషింగ్టన్ వారసుడికి ఒక పతకాన్ని తిరిగి ఇస్తున్నారు. మా స్వేచ్ఛ కోసం ఆయన చూపిస్తున్న అచంచలమైన నిబద్ధతకు గుర్తింపుగా నా నోబెల్ శాంతి బహుమతి మెడ...