భారతదేశం, జూలై 15 -- అకడమిక్ అసిస్టెన్స్ పేరుతో ఒక బాలికను నగరానికి రప్పించి అత్యాచారం చేసి బ్లాక్ మెయిల్ చేసిన ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. ఈ నేరానికి సంబంధించి ఇద్దరు కాలేజీ లెక్చరర్లు, వారి స్నేహితుడిని బెంగళూరులో పోలీసులు అరెస్టు చేశారు.

బాధితురాలు కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. సత్వర చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్ పోలీసులను ఆదేశించింది. నిందితులను ఫిజిక్స్ లెక్చరర్ నరేంద్ర, బయాలజీ లెక్చరర్ సందీప్ మరియు ఆ ఇద్దరికి సన్నిహితుడైన అనూప్ గా పోలీసులు గుర్తించారు. ఈ ముగ్గురూ బెంగళూరులోని ఓ ప్రైవేట్ కాలేజీలో పనిచేస్తున్నారు.

ఆ విద్యార్థిని చదువుతున్న సబ్జెక్ట్ లకు సంబంధించిన అకడమిక్ నోట్స్ ఇస్తామని చెప్పి నరేంద్ర మొదట ఆ విద్యార్థినిని బెంగళూరుకు ఆహ్వానించాడు. అక్కడ ఆమెను తన స్నేహితుడి...