Singareni,telangana,odisha, ఏప్రిల్ 16 -- ఒడిశాలో సింగ‌రేణి నైనీ బొగ్గు బ్లాక్ ప్రారంభమైంది. 13 దశాబ్దాల చరిత్రలో తొలిసారిగా ఇతర రాష్ట్రంలోకి సింగరేణి సంస్థ అడుగుపెట్టింది. అంగూల్ జిల్లాలో సింగ‌రేణి సంస్థ‌కు కేటాయించిన నైనీ బొగ్గు బ్లాక్ ను ఇవాళ రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క వ‌ర్చువ‌ల్‌ గా ప్రారంభించారు.

ఇప్ప‌టి వ‌ర‌కు తెలంగాణ రాష్ట్రం వ‌ర‌కే ప‌రిమిత‌మై బొగ్గు గ‌నులు నిర్వ‌హిస్తున్న సింగ‌రేణి ఇప్పుడు నైనీ బొగ్గు బ్లాక్ ద్వారా ఇత‌ర రాష్ట్రాల్లోకి అడుగుపెట్ట‌ినట్లు అయింది. ఇదోక ఒక చ‌రిత్రాత్మ‌క ఘ‌ట్టంగా అధికారులు పేర్కొన్నారు.

2016 మే నెలలో ఈ గనిని కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ సింగరేణికి కేటాయించింది. అన్ని రకాల అనుమతులు సాధించినప్పటికీ. తవ్వకం ప్రారంభించడానికి తొమ్మిదేళ్ళ సుదీర్ఘ కాలం నిరీక్షించాల్సి వచ్చింది. ఇటీవలే కాలంలో ప...