భారతదేశం, నవంబర్ 19 -- ఈ ఏడాది మే నెలలో నటి కాయదు లోహార్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దృష్టి సారించిందని, ఆమెను తమిళనాడులోని టస్మాక్ (TASMAC) కేసుతో ముడిపెట్టారని వార్తలు వచ్చాయి. అంతే కాకుండా సెప్టెంబర్‌లో కరూర్ తొక్కిసలాట తర్వాత, ఆమె పేరుతో ఒక నకిలీ ఖాతాలో విజయ్ ర్యాలీలో తన స్నేహితుడు మరణించాడనే పోస్టు వచ్చింది. ఈ పుకార్లు వ్యాప్తి చెందిన నెలల తర్వాత డ్రాగన్ హీరోయిన్ కాయదు 'బిహైండ్‌వుడ్స్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మౌనం వీడింది.

నైట్ పార్టీ కోసం రూ.35 లక్షలు తీసుకోవడం, మద్యం స్కామ్ తో సంబంధాల ఆరోపణలపై కాయదు లోహర్ స్పందించింది. ప్రజలు తన గురించి ఇలా మాట్లాడటం కష్టంగా ఉందని ఆమె అంగీకరించింది. పుకార్లను ఎదుర్కోవడం కష్టంగా ఉందని తెలిపారు. కాయదు ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రదీప్ రంగనాథన్‌తో కలిసి 'డ్రాగన్' చిత్రంలో నటించిన తర్వాత పాపులర్ అ...