భారతదేశం, సెప్టెంబర్ 5 -- రాత్రి షిఫ్టుల్లో పని చేయడం వల్ల శరీరంలోని సహజ జీవగడియారం (సర్కాడియన్ రిథమ్) దెబ్బతింటుంది. ఇది హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీసి, గర్భధారణ, సంతానోత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

ఈ విషయమై ఢిల్లీ మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో ఆబ్‌స్టెట్రిషియన్ అండ్ గైనకాలజీ విభాగం డైరెక్టర్ డాక్టర్ యశికా గుడెసార్ ఓ ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడించారు. "రాత్రిపూట చేసే ఉద్యోగాల వల్ల నిద్ర లేకపోవడం, ఒత్తిడి, జీవనశైలిలో అసమతుల్యత వంటివి ఏర్పడతాయి. ఇవి క్రమరహిత పీరియడ్స్, అండం విడుదల తగ్గడం (డిక్రీస్డ్ ఓవులేషన్), చివరికి గర్భధారణలో సమస్యలకు దారితీస్తాయి" అని ఆమె వివరించారు.

అయితే, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యలను అధిగమించి, సంతానోత్పత్తితో పాటు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని డాక్టర్ యశికా కొన్ని ముఖ్యమైన చిట్కాలను స...