భారతదేశం, నవంబర్ 11 -- కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం గండిగుంట దగ్గరలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి.. నేషనల్ హైవే మీద నుంచి సర్వీస్ రోడ్డులోకి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మరణించారు. మరొక వ్యక్తికి తీవ్ర గాయాలు అవ్వగా.. ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతు పరిస్థితి విషమించి అతడు మరణించాడు. అతివేగమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు ఏపీకి చెందినవారే.

కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం వలసపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో సోమవారం ఇంటి పైకప్పు కూలిపోయి 40 ఏళ్ల వీరమ్మ అనే మహిళ మరణించింది. సమీపంలోని సిమెంట్ ఫ్యాక్టరీ చుట్టుపక్కల కొండల నుండి ముడి పదార్థాలను వెలికితీస్తూ తరచుగా క్వార...