భారతదేశం, మే 23 -- నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించిన ఛార్జిషీట్‌లో.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రస్తావించింది. యంగ్ ఇండియన్, అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌లకు విరాళాలు అందించడానికి సహకరించిన కాంగ్రెస్ నాయకులలో.. రేవంత్ రెడ్డి కూడా ఉన్నారని ఈడీ స్పష్టం చేసింది. కానీ ఆయనను నిందితుడిగా పేర్కొనలేదు.

ఏప్రిల్ 9న కోర్టులో ఈడీ ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ.. యంగ్ ఇండియన్ ద్వారా ఏజీల్‌కు చెందిన సుమారు రూ.2,000 కోట్ల విలువైన ఆస్తులను మళ్లించడానికి పథకాన్ని రచించారని ఆరోపించింది. రేవంత్ రెడ్డి, దివంగత అహ్మద్ పటేల్, పవన్ బన్సాల్ వంటి కొంతమంది కాంగ్రెస్ నాయకులు 2019- 2022 మధ్య ఏఐ, ఏజీఎల్‌కు విరాళాలు ఇవ్వడానికి కొందరిని ప్రభావితం చేశారని.. ఈడీ...