భారతదేశం, ఏప్రిల్ 15 -- నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మంగళవారం చార్జిషీట్ దాఖలు చేసింది. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ ఎంపీలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, కాంగ్రెస్ ఓవర్సీస్ చీఫ్ శామ్ పిట్రోడాపై ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో కేంద్ర దర్యాప్తు సంస్థ ప్రాసిక్యూషన్ ఫిర్యాదు దాఖలు చేసింది.

చార్జిషీట్ లో సుమన్ దూబే తదితరుల పేర్లు కూడా ఉన్నాయి. ఈ కేసులో వాదనలను ఏప్రిల్ 25వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు కోర్టు తెలిపింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం 2002లోని సెక్షన్ 44, 45 కింద ప్రాసిక్యూషన్ ఫిర్యాదు దాఖలు చేసినట్లు ఈడీ తెలిపింది. నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రిక, అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ కు సంబంధించిన మనీలాండరింగ్ కేసు దర్...