భారతదేశం, మే 2 -- ేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి దిల్లీ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకునే సమయంలో తమ వాదనలు వినిపించే హక్కు సోనియా, రాహుల్‌లకు ఉందని కోర్టు పేర్కొంది. ఏ స్థాయిలోనైనా తనను తాను సమర్థించుకునే హక్కు నిష్పాక్షిక విచారణకు జీవనాడి అని ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే అన్నారు. ఛార్జిషీట్‌పై న్యాయబద్ధమైన విచారణ జరిగే సమయంలో అవతలి పక్షంవారు తమ వాదనలను వినిపించే హక్కు ఉంటుందని చెప్పారు. దీని మీద తదుపరి విచారణనను మే8కి వాయిదా వేస్తున్నట్టుగా తెలిపారు.

నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో నిందితులను విచారించకుండా ఛార్జిషీట్ పరిగణనలోకి తీసుకోలేమని, విచారణకు హాజరయ్యేలా వారికి నోటీసులు ఇవ్వాలని దిల్లీ కోర్టును ఈడీ ఆశ్రయించింది. అయితే గతవారం ఈ కేస...