Hyderabad, ఆగస్టు 15 -- ప్రతిష్ఠాత్మక సైమా అవార్డ్స్ 2025 (సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌) వేడుక దుబాయ్‌లో అంగరంగ వైభవంగా జరగనుంది. సైమా అవార్డ్స్ వేడుకలను సెప్టెంబర్ 5, 6 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆ వేడుకలకు సంబంధించి సైమా అవార్డ్స్ 2025 ప్రెస్ మీట్‌ హైదరాబాద్‌లో జరిగింది.

విజేతలకు సైమా సత్కారం

ఈ సందర్భంగా నేషనల్ అవార్డ్ విజేతలైన దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత సాహు గారపాటి (భగవంత్ కేసరి), దర్శకుడు సాయి రాజేష్, సింగర్ రోహిత్ (బేబీ) దర్శకుడు ప్రశాంత్ వర్మ, విజువల్ ఎఫెక్ట్స్ వెంకట్ (హనుమాన్)లను సైమా ఘనంగా సత్కరించింది.

ఇక ప్రెస్ మీట్‌లో నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. విష్ణు, బృందాకి కంగ్రాచ్యులేషన్స్. 12 ఏళ్లుగా ఈ వేడుకని విజయవంతంగా నిర్వహిస్తూ ఇప్పుడు 13వ ఎడిషన్‌కి సైమా శ్రీకారం చుట్టడ...