భారతదేశం, మే 10 -- ఉగ్రవాద నిర్మూలనలో భారత బలగాల ధైర్యసాహసాలు దేశ ప్రజలందరికీ గర్వకారణమని.. స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు కొనియాడారు. దేశ రక్షణ కోసం పోరాడుతున్న వీరజవాన్లకు మద్దతుగా తన ఒక నెల వేతనం రూ.2,17,000 నేషనల్‌ డిఫెన్స్‌ ఫండ్‌కు విరాళంగా ప్రకటించారు. దేశభక్తి గల పౌరులందరూ ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. భారత్‌- పాకిస్తాన్ మధ్య జరుగుతున్న తాజా పరిణామాలపై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ స్పందించారు. భారత సైన్యానికి తమ మద్దతు ఉంటుందని చెప్పారు. దేశ రక్షణ నిధికి విరాళం కూడా ప్రకటించారు.

భారత జాతీయ రక్షణ నిధిని 1962లో స్థాపించారు. దీని స్వచ్ఛంద విరాళాలను స్వీకరిస్తారు. ఈ నిధిని సాయుధ దళాలు (పారా మిలిటరీ దళాలతో సహా), వారిపై ఆధారపడిన వారి సంక్షేమం కోసం ఉపయోగిస్తారు. ఈ నిధిని ఒక కార్యనిర్వాహక కమిటీ నిర్వహిస్తుంది. దీనికి భారత ప్రధ...