భారతదేశం, ఏప్రిల్ 26 -- చేపల వేటపై ఆధారపడిన కుటుంబాలకు అండగా నిలవడానికి.. కూటమి ప్రభుత్వం మత్స్యకారుల సేవలో పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద.. వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించనున్నారు. ఒక్కో కుటుంబానికి రూ.20,000 ఆర్థిక సహాయం అందించనున్నారు. ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు.

పథకం పేరు- మత్స్యకార సేవలో

ప్రారంభించే వారు- ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

ప్రారంభ తేదీ- ఏప్రిల్ 26, 2025

ప్రారంభించే స్థలం- బుడగట్లపాలెం గ్రామం, ఎచ్చెర్ల నియోజకవర్గం, శ్రీకాకుళం జిల్లా

లబ్ధిదారులు- సముద్ర తీర ప్రాంతంలో చేపల వేటపై ఆధారపడిన మత్స్యకార కుటుంబాలు

చేపల వేట నిషేధ కాలంలో ఒక్కో మత్స్యకార కుటుంబానికి రూ. 20,000 ఆర్థిక సహాయం అందిస్తారు.

ఈ సహాయం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు.

రాష్ట్రవ్యాప్తంగా సుమా...