భారతదేశం, జనవరి 8 -- ఓ తెలుగు థ్రిల్లర్ మూవీ ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి వస్తోంది. అందులోనూ ఈ సినిమాలో లీడ్ రోల్లో నటించింది శోభితా ధూళిపాళ కావడంతో దీనిపై మరింత ఆసక్తి నెలకొంది. 'చీకటిలో' అనే ఈ సినిమా స్ట్రీమింగ్ తేదీని అమెజాన్ ప్రైమ్ వీడియో గురువారం (జనవరి 8) తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అనౌన్స్ చేసింది.

అక్కినేని నాగ చైతన్యతో పెళ్లి తర్వాత ఏడాది కాలంగా తెలుగు వాళ్లకు కూడా బాగా దగ్గరైన తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ. ఆమె ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా 'చీకటిలో' (Cheekatilo). ఈ సినిమా థియేటర్లను స్కిప్ చేసి డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో జనవరి 23 నుంచి స్ట్రీమింగ్‌కు రాబోతోంది.

తెలుగులో అడివి శేష్ 'మేజర్' సినిమా తర్వాత శోభిత నటిస్తున్న డైరెక్ట్ తెలుగు సినిమా ఇద...