భారతదేశం, ఫిబ్రవరి 6 -- సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని అనే డైలాగ్ గుర్తుందా? ఈటీవీ విన్ ఓటీటీలో వచ్చిన పాపులర్ వెబ్ సిరీస్ #90's ఎ మిడిల్ క్లాస్ బయోపిక్ లో నటుడు రోహన్ కి బ్యాక్‌గ్రౌండ్ లో తరచూ వినిపిస్తుంటుంది. ఇప్పుడిదే టైటిల్ తో అదే ఓటీటీలోకి నేరుగా ఓ మూవీ వస్తోంది. దీని ట్రైలర్ ను అనిల్ రావిపూడి లాంచ్ చేయనుండటం విశేషం.

ఈటీవీ విన్ ఓటీటీ ఒరిజినల్ మూవీగా వస్తున్న సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని ట్రైలర్ ను శనివారం (ఫిబ్రవరి 7) లాంచ్ చేయబోతున్నారు. దీనిని ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి లాంచ్ చేయనుండటం విశేషం. ఈ సినిమాను ఫిబ్రవరి 12 నుంచి స్ట్రీమింగ్ చేయనుండగా.. ట్రైలర్ పై ఆసక్తి నెలకొంది.

ఈ మూవీలో సీనియర్ నటుడు శివాజీ, లయ, మాస్టర్ రోహన్, ప్రిన్స్ లాంటి వాళ్లు నటిస్తున్నారు. ఇందులోని పాత్రలను పరిచయం చేస్తూ కొన్ని రోజులుగా ఈటీ...