Hyderabad, జూన్ 10 -- థ్రిల్లర్ మూవీ అభిమానులకు గుడ్ న్యూస్. ఇప్పుడో థ్రిల్లర్ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకే వస్తోంది. ఈ సినిమా పేరు డిటెక్టివ్ షేర్దిల్ (Detective Sherdil). జీ5 (Z5) ఓటీటీలోకి ఈ మూవీ స్ట్రీమింగ్ కు వస్తోంది. మరి ఈ మూవీ ట్రైలర్ ఎలా ఉంది? స్ట్రీమింగ్ వివరాలు తెలుసుకోండి.

ప్రముఖ బాలీవుడ్ సింగర్, నటుడు దిల్జీత్ దోసాంజ్ నటించిన థ్రిల్లర్ మూవీ డిటెక్టివ్ షేర్దిల్. ఓ బిలియనీర్ హత్య, దర్యాప్తు చుట్టూ తిరిగే కథతో ఓటీటీలోకి వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఆసక్తి రేపుతోంది. మంగళవారం (జూన్ 10) ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

"ఎంతో మంది అనుమానితులు ఉన్న ఓ హత్య. ప్రతి ఒక్కరి మనసు తాళం చెవి ఉన్న ఓ షేర్. మీరు సిద్ధంగా ఉన్నారా? ట్రైలర్ వచ్చేసింది. డిటెక్టివ్ షేర్దిల్ జూన్ 20 నుంచి మీ జీ5 ఓటీటీలో.." అనే క్యాప్షన్ తో ఈ ట్ర...