Hyderabad, ఏప్రిల్ 24 -- రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఎస్ఎస్ఎంబీ29 మూవీలో మహేష్ బాబు సరసన నటిస్తున్న ప్రియాంకా చోప్రా అటు హాలీవుడ్ లోనూ బిజీగానే ఉంటోంది. ఆమె నటించిన ఓ యాక్షన్ కామెడీ మూవీ నేరుగా ఓటీటీలోకి వస్తోంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలోనే స్ట్రీమింగ్ కు రాబోతోంది. మరి ఆ మూవీ వివరాలేంటో చూడండి.

ప్రియాంకా చోప్రా నటించిన మూవీ హెడ్స్ ఆఫ్ స్టేట్. ఇదొక యాక్షన్ కామెడీ జానర్ సినిమా. ఇందులో డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ జాన్ సీనాతోపాటు ఇద్రిస్ ఎల్బా కూడా నటిస్తున్నారు. ఈ మూవీ జులై 2 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు రాబోతోంది.

"ఈ సినిమా కోసం మీరు హాయిగా సోఫాకు అతుక్కుపోతారు. హెడ్స్ ఆఫ్ స్టేట్ జులై 2 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో" అనే క్యాప్షన్ తో ఆమె ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఇది ప్రైమ్ వీడియో ఒరిజినల్ మూవీగా రాబోతోంది. ఇంగ్లిష్ తో...