Hyderabad, మే 6 -- ఓటీటీలో కేవలం తెలుగు కంటెంట్ అందించే ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్. ఈమధ్య ఆ ఓటీటీ కథాసుధ పేరుతో ప్రతి ఆదివారం సరికొత్త సినిమాలను అందిస్తోంది. సందేశాత్మకంగా సాగే ఈ సిరీస్ నుంచి ఇప్పుడు ఓ రొమాంటిక్ కామెడీ సినిమా కూడా వస్తోంది. ఈ విషయాన్ని మంగళవారం (మే 6) ఆ ఓటీటీ తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.

ఈటీవీ విన్ కథాసుధలో భాగంగా వస్తున్న సరికొత్త మూవీ సుందరం గాడి ప్రేమ కథ. ఈ రొమాంటిక్ కామెడీ మూవీ వచ్చే ఆదివారం (మే 11) ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించడంతోపాటు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తూ నిర్మించాడు ప్రముఖ డైరెక్టర్ రాఘవేంద్రరావు.

"ఓ క్రేజీ రొమాంటిక్ కామెడీ లవ్ స్టోరీ మొదలైంది. సుందరం గాడి ప్రేమ కథ మే 11 నుంచి కేవలం ఈటీవీ విన్‌లో. నవ్వులు, ప్రేమ, డ్రామా గ్యారెంటీ. స్క్రీన్ ప్లే, ప్రొడ్యూసర్, దర్శకత్...