భారతదేశం, మే 3 -- సుమంత్ హీరోగా న‌టించిన తెలుగు మూవీ అన‌గ‌న‌గా థియేట‌ర్ల‌ను స్కిప్ చేస్తూ డైరెక్ట్‌గా ఓటీటీలోకి రాబోతోంది. ఈటీవీ విన్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. అన‌గ‌న‌గా ఓటీటీ రిలీజ్ డేట్‌ను శ‌నివారం ఓ వీడియో ద్వారా ఈటీవీ విన్ అనౌన్స్‌చేసింది. మే 15న విడుద‌ల‌కాబోతున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

ఈ వీడియోలో సుమంత్ బుక్ చ‌దువుతుండ‌గా...అత‌డి కొడుకు ప్ర‌శ్న‌ల‌తో విసిగించ‌డం క‌నిపించింది. ప్ర‌తి క‌థ అన‌గ‌న‌గాతో ఎందుకు మొద‌ల‌వుతుంది. క‌నీసం ఈ ప్ర‌శ్న‌కైనా స‌మాధానం చెప్ప‌మ‌ని సుమంత్‌ను అత‌డి కొడుకు అడిగాడు. ఒక మంచి క‌థ‌...స్నేహం, ప్రేమ‌, లేదా ఓ చిన్న జ్ఞాప‌కాన్ని గుర్తుచేస్తుంద‌ని సుమంత్ స‌మాధానం ఇచ్చిన‌ట్లుగా ఈ వీడియోలో క‌నిపిస్తోంది.

అయితే మ‌న క‌థ కూడా చెప్పొచ్చుగా అని చిన్నారి అడ‌గ్గా...సుమంత్ స‌రే అని బ‌దులివ్వ‌డం ఈ వీడియోలో ఆస‌క్తిన...