Hyderabad, మే 9 -- ఈటీవీ విన్ ఓటీటీలోకి మరో సందేశాత్మక సినిమా వస్తోంది. ఈ మూవీ పేరు అనగనగా. సుమంత్ లీడ్ రోల్లో నటిస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్ శుక్రవారం (మే 9) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య ఈ ట్రైలర్ రిలీజ్ చేయడం విశేషం.

అనగనగా మూవీ తండ్రీకొడుకుల సెంటిమెంట్ తోపాటు పిల్లలకు చదువుతోపాటు కథలు ఎంత ముఖ్యమో చెబుతూ సాగేలా ట్రైలర్ చూస్తే కనిపిస్తోంది. శుక్రవారం ఈ ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత నాగ చైతన్య తన ఎక్స్ అకౌంట్ ద్వారా షేర్ చేశాడు. "ఓ అందమైన, హృదయాన్ని తాకే ట్రైలర్ ఇది. అనగనగా.. ఓ మనసును హత్తుకునే మూవీ మే 15న ఈటీవీ విన్ లో రిలీజ్ కాబోతోంది. సుమంత్ అన్న నటించిన ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాను. మొత్తం టీమ్ కు నా అభినందనలు" అనే చైతూ ట్వీట్ చేశాడు.

అటు ఈటీవీ విన్ ఓటీటీ కూడా తన ఎక్స్ అకౌంట్ ద్వార...