భారతదేశం, జూలై 11 -- వారం వారం ఓటీటీలోకి సినిమాలు వస్తూనే ఉంటాయి. అందులో డిఫరెంట్ జోనర్ మూవీస్ ఉంటాయి. కొన్ని థ్రిల్లర్లు ఆడియన్స్ ను బాగా ఎంగేజ్ చేస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకునేది అలాంటి ఓ సినిమా గురించే. గ్రామంలో జరిగే హత్యల వెనుక ఉన్నది ఎవరో కనిపెట్టే కథతో, గ్రిప్పింగ్ స్టోరీ లైన్ తో సాగే 'డిటెక్టివ్ ఉజ్వలన్' సినిమా ఈ రోజు (జూలై 11) ఓటీటీలోకి వచ్చేసింది.

మలయాళ థ్రిల్లర్ సినిమా 'డిటెక్టివ్ ఉజ్వలన్' ఓటీటీలోకి అడుగుపెట్టింది. శుక్రవారం నుంచే ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయింది. జూలై 11 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అయితే కేవలం మలయాళం భాషలోనే ఈ సినిమా ఓటీటీ ఆడియన్స్ కు అందుబాటులోకి వచ్చింది. మే 23, 2025న థియేట్రికల్ రిలీజ్ తో డిటెక్టివ్ ఉజ్వలన్ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ప్రదర్శన చేసింది.

డిటెక్టివ్ ఉజ్...