భారతదేశం, మే 16 -- దేశంలోనే తొలిసారి తెలంగాణ పోలీసులు నేరస్తుల్ని గుర్తించడానికి కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. క్రిమినల్స్‌ను గుర్తించేందుకు ఆటోమెటేడ్‌ మల్టీ మోడల్ ఫింగర్ ప్రింట్‌ ఐడెంటిఫికేషన్‌ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు.

ఆధునిక సాంకేతిక వ్యవస్థతో నేరస్తులను సులభంగా, వేగంగా గుర్తించవచ్చని పోలీస్ అధికారులు చెబుతున్నారు. ఈ విధానాన్ని మొదట పైలెట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలో కొన్ని సెలెక్టెడ్ స్టేషన్లలో అమలు చేశారు. అది సక్సెస్ కావడంతో విడతల వారీగా అన్ని స్టేషన్లలో వినియోగంలోకి తెచ్చేలా కసరత్తు చేస్తున్నారు.

రాష్ట్రంలో దొంగతనాలు, మర్డర్లు, దాడులు.. ఇలా వివిధ రకాల నేరాలు జరిగినప్పుడు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఫింగర్ ప్రింట్స్ సేకరించేవారు. ఆల్రెడీ వారి వద్ద భద్రపరిచి ఉన్న ఫింగర్ ప్రింట్స్ తో వాటిని సరిపోల్చి చూసేవారు. ...