భారతదేశం, సెప్టెంబర్ 11 -- నేపాల్‌లో నిరసనల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న ఏపీ వాసుల గురించి మంత్రి నారా లోకేశ్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ వాసులను సురక్షితంగా తీసుకొస్తాని చెప్పారు. అక్కడ ఉన్న తెలుగువారి పరిస్థితిపై మీడియాతో మాట్లాడారు.

మఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు నేపాల్‌లో ఉన్న వారిని తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి లోకేశ్ తెలిపారు. అక్కడ ఉన్న మనవాళ్లతో మాట్లాడి పరిస్థితి తెలుసుకున్నామన్నారు. ఏపీ భవన్‌లో టోల్‌ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసిన నేపాల్‌లోని తెలుగువారిని గుర్తించామన్నారు. తమ దగ్గర ఉన్న సమాచారం ప్రకారం. వేర్వేరు ప్రాంతాల్లో 217 మంది రాష్ట్ర వాసులు ఉన్నారని తెలిపారు.

ఖాట్మాండు నుంచి గురువారం మధ్యహ్నం ప్రత్యేక విమానంలో వారందరినీ రాష్ట్రానికి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటామన్నారు. నేపాల్‌...