భారతదేశం, సెప్టెంబర్ 10 -- భారత సినీ పరిశ్రమలో 'నెపోటిజం' (వారసత్వ రాజకీయాలు/కుటుంబ పాలన) అంటే స్టార్ కిడ్స్ సులభంగా సినిమాలు, అవార్డులు పొందుతారు.. బయటివారు మాత్రం తలుపులు మూసుకుని పోరాడాల్సి వస్తుంది అనే అర్థంలో వాడుతుంటారు. కానీ పక్కనే ఉన్న నేపాల్‌లో ఈ పదం చాలా తీవ్రమైన కోణాన్ని సంతరించుకుంది. అధికారంలో ఉన్న రాజకీయ నాయకుల 'నెపో కిడ్స్' (వారసుల)పై ప్రజల్లో పేరుకుపోయిన కోపం నేపాల్‌లో నిప్పు రాజేసింది.

ఈ ఆందోళనల కారణంగా ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ రాజీనామా చేయాల్సి వచ్చింది. నిరసనకారులు మంత్రుల ఇళ్లను, పార్లమెంటు భవనాన్ని కూడా ధ్వంసం చేశారు. ఈ హింసలో 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒక మాజీ ప్రధాని భార్య కూడా ఉన్నారు.

యూత్ ఉద్యోగాలు దొరక్క అల్లాడుతుంటే, రాజకీయ నాయకుల పిల్లలు మాత్రం విలాసవంతమైన జీవితాలను గడుపుతున్నారని యువతలో తీ...