భారతదేశం, డిసెంబర్ 12 -- బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన నివాసం 'జల్సా' బయట అభిమానుల కోలాహలాన్ని చూసి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. గత ఆదివారం (డిసెంబర్ 7) నాటి వీడియోలు, ఫోటోలను తన బ్లాగ్‌లో షేర్ చేస్తూ.. "ఇంతటి ప్రేమను పొందేందుకు నేనేం చేశానో నాకే తెలియదు" అని రాసుకొచ్చాడు. ఇదే సమయంలో కొడుకు అభిషేక్ బచ్చన్‌పై ఒక అభిమాని చూపిన ప్రేమని చూసి గర్వంగా ఉందంటూ కామెంట్ చేశాడు.

ప్రతి ఆదివారం ముంబైలోని తన నివాసం 'జల్సా' బయట అభిమానులను కలుసుకోవడం అమితాబ్ బచ్చన్‌కు అలవాటు. అయితే తాజాగా అక్కడ కనిపించిన జనసంద్రం, వారి అభిమానం చూసి అతడు ఎమోషనల్ అయ్యాడు. శుక్రవారం (డిసెంబర్ 12) నాడు తన బ్లాగ్‌లో ఆ వీడియోలను షేర్ చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జల్సా బయట అభిమానులు తన కోసం కేరింతలు కొడుతుంటే, వారి ప్రేమను చూసి అమితాబ్ ఆశ్చర్యపోయాడు.

"అభిమానుల...