Hyderabad, మే 25 -- తెలుగులో మోస్ట్ క్రేజీ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు గుణశేఖర్. ఇప్పుడు లేటెస్ట్‌గా గుణశేఖర్ దర్శకత్వం వహించిన సినిమా యుఫోరియా. గుణ హ్యాండ్ మేడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద నీలిమ గుణ నిర్మాణంలో నూతన నటీనటులతో గుణ శేఖర్ ఈ సినిమాను తెరకెక్కించారు.

ఓ ట్రెండీ టాపిక్‌ మీద తెరకెక్కిన యుఫోరియా మూవీలో సీనియర్ హీరోయిన్ భూమిక చావ్లా, సారా అర్జున్, నాసర్, రోహిత్, విఘ్నేష్ గవిరెడ్డి, లిఖిత యలమంచలి, అడ్డాల పృథ్వీరాజ్, కల్ప లత, సాయి శ్రీనికా రెడ్డి, అశ్రిత వేముగంటి, మాథ్యూ వర్గీస్, ఆదర్శ్ బాలకృష్ణ, రవి ప్రకాష్, నవీనా రెడ్డి, లికిత్ నాయుడు ముఖ్య పాత్రలు పోషించారు.

శనివారం నాడు (మే 24) యుఫోరియా మూవీ నుంచి ఫ్లై హై అనే ఫస్ట్ సింగిల్‌ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా ఏఎంబీలోని శరత్ సిటీ మాల్‌లో యుఫోరియా ఫ్లై హై సాంగ్ లాంచ్ ఈవెంట్ ని...