భారతదేశం, డిసెంబర్ 25 -- అనసూయ మరోసారి మాటలతో రెచ్చిపోయింది. సీనియర్ నటుడు శివాజీపై మండిపడింది. తాను కూడా హీరోయిన్ నే అని, తనకు దూరంగా ఉండాలని చెప్పింది. చేతగానితం, దమ్ముందా అంటూ ఇన్ స్టాగ్రామ్ లైవ్ వీడియోలో సంచలన వ్యాఖ్యలు చేసింది అనసూయ.

''అతి వినయం ధూర్త లక్షణం. నేను ఒక స్టోర్ లాంఛ్ కు వెళ్లా. అక్కడ జర్నలిస్ట్ లు అడిగిన దానికి చెప్పా. ఆయనకు అనిపించింది ఆయన చెప్పినట్లు నాకు అనిపించింది నేను చెప్పా. ఈ రోజు ఆయన ఒక్కరే ప్రెస్ మీట్ పెట్టి విక్టిమ్ లా కూర్చున్నారు. ఇది చేతగానితనం. ఫెమినిజం అనే వర్డ్ ఉండకూడదు. ఆడ, మగ ఉంటేనే ప్ర‌కృతి ముందుకు వెళ్తుంది'' అని ఇన్ స్టాగ్రామ్ లైవ్ లో చెప్పింది అనసూయ.

''బట్టల గురించి మాట్లాడటం చేతగానితనం. వాళ్లకు కంట్రోల్ లేనప్పుడు వేరే వాళ్లను కంట్రోల్ చేయాలని చూస్తున్నారు. పాపం ఆయనకు సింపతీ కావాలి కాబట్టి అదే ఇస...