భారతదేశం, జనవరి 6 -- టాలీవుడ్ వెర్సటైల్ హీరో అడివి శేష్ తన నెక్ట్స్ మూవీ 'డెకాయిట్' (Dacoit) కోసం ఒక క్రేజీ నిర్ణయం తీసుకున్నాడు. 90వ దశకంలో దేశాన్ని ఊపేసిన హిందీ పాట "తూ చీజ్ బడి హై మస్త్ మస్త్" (Tu Cheez Badi Hai Mast Mast)ను ఈ సినిమాలో రీమిక్స్/రీక్రియేట్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన హక్కులను అధికారికంగా కొనుగోలు చేసినట్లు శేష్ వెల్లడించాడు.

గూఢచారి, మేజర్ సినిమాలతో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్న అడివి శేష్.. ఇప్పుడు 'డెకాయిట్' అనే ఇంటెన్స్ యాక్షన్ లవ్ స్టోరీతో వస్తున్నాడు. ఈ సినిమాలో ఒకప్పటి క్లాసిక్ సాంగ్ ను వాడటానికి గల ఆసక్తికర కారణాన్ని అతడు బయటపెట్టాడు. 'మొహ్రా' (Mohra - 1994) సినిమాలోని ఈ పాటంటే శేష్ కు చాలా ఇష్టమట.

"కొన్ని పాటలు మనతో పాటే ఉండిపోతాయి. 90ల్లో పెరిగిన మాకు ఈ పాట అంటే ఒక వైబ్. నిజానికి నేను స్కూల్ స్టేజ్ మ...