భారతదేశం, అక్టోబర్ 26 -- అందాల రాక్షసి సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమైన హీరో రాహుల్ రవీంద్రన్ అనంతరం దర్శకుడిగా న. చిలసౌ అనే సినిమాతో డైరెక్టర్‌గా డెబ్యూ ఇచ్చిన రాహుల్ రవీంద్రన్ మంచి హిట్ అందుకున్నారు. అనంతరం నాగార్జునతో చేసిన మన్మథుడు 2 డిజాస్టర్‌గా నిలిచింది.

ఇప్పుడు దర్శకుడిగా రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన కొత్త సినిమా ది గర్ల్‌ఫ్రెండ్. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, దీక్షిత్ శెట్టి మెయిన్ లీడ్ రోల్స్‌లో నటించారు. ది గర్ల్‌ఫ్రెండ్ చిత్రాని అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ కలిసి నిర్మిస్తున్నాయి.

రొమాంటిక్, ఇంటెన్స్, ఎమోషనల్ లవ్ స్టోరీగా ది గర్ల్‌ఫ్రెండ్ తెరకెక్కింది. సరికొత్త ప్రేమ కథ అంటూ నవంబర్ 7న థియేటర్లలో ది గర్ల్‌ఫ్రెండ్ గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ క్రమంలో తాజాగా అక్టోబర్ 25న ది...