Hyderabad, జూన్ 30 -- సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన 'యానిమల్' మూవీపై బాక్సాఫీస్ దగ్గర ఎంత పెద్ద హిట్ అయిందో అన్నే విమర్శలు కూడా వచ్చాయి. రష్మిక మందన్న, రణబీర్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు. హింస, స్త్రీ ద్వేషంపై విమర్శలు వచ్చాయి. అయితే ఈ విమర్శలపై తాజాగా రష్మిక మందన్నా స్పందించింది. ఇటీవల మోజో స్టోరీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడింది.

'యానిమల్' మూవీని సమర్థిస్తూ.. ఒకవేళ తెరపై స్మోకింగ్ చేయమని అడిగితే ఆ సినిమాను వదులుకుంటానని రష్మిక స్పష్టం చేసింది. అయితే సినిమాను సినిమాలాగా చూడాలని స్పష్టం చేసింది. "నేను సినిమాను సినిమాగా చూశాను. హీరో తెరపై స్మోకింగ్ చేస్తే, అది ఇతరులను ప్రభావితం చేస్తుందని అంటారు. కానీ ఈ రోజుల్లో, సమాజంలో స్మోకింగ్ చేయడం చాలా సాధారణం.

నేను ఏ విధంగానూ ప్రభావితం కావడానికి సినిమా చూడను. వ్యక్తిగతంగా, నేను తెర...