భారతదేశం, డిసెంబర్ 18 -- టాలీవుడ్ హీరో నరేష్ అగస్త్య, బ్యూటిపుల్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన సినిమా "గుర్రం పాపిరెడ్డి". ఈ సినిమాలో లెజండరీ కమెడియన్ బ్రహ్మానందం కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రాన్ని డా. సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్ వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మిస్తున్నారు.

డార్క్ కామెడీ కథతో ఇప్పటి వరకు మనం తెరపై చూడని కాన్సెప్ట్‌తో దర్శకుడు మురళీ మనోహర్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారని టాక్. "గుర్రం పాపిరెడ్డి" సినిమా ఈ నెల 19న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది.

ఈ నేపథ్యంలో ఇటీవల డిసెంబర్ 17న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా గుర్రం పాపిరెడ్డి ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లెజండరీ కమెడియన్ బ్రహ్మానందం ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.

స్టార్ కమెడియన్ బ్రహ్మానందం మాట్లాడుతూ.. "గుర్...