భారతదేశం, డిసెంబర్ 14 -- 'క‌ల‌ర్ ఫోటో', 'బెదురులంక 2012' సినిమాల నిర్మాతల నుంచి వస్తోన్న సరికొత్త మూవీ దండోరా. లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ర‌వీంద్ర బెన‌ర్జీ ముప్పానేని నిర్మించిన ఈ సినిమాకు మురళీకాంత్ దర్శకత్వం వహించారు.

దండోరా మూవీలో బిగ్ బాస్ ఫేమ్ శివాజీ, న‌వ‌దీప్‌, బిందు మాధవి, నందు, ర‌వికృష్ణ‌, మ‌నికా చిక్కాల‌, మౌనికా రెడ్డి, రాధ్య‌, అదితి భావ‌రాజు త‌దిత‌రులు కీలక పాత్రల్లో నటించారు. డిసెంబర్ 25న దండోరా మూవీ రిలీజ్ కానుండగా తాజాగా డిసెంబర్ 13న టైటిల్ సాంగ్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా దండోరా టైటిల్ సాంగ్ లాంచ్ ఈవెట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో బిగ్ బాస్ ఫేమ్, హీరో శివాజీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అవి సోషల్ మీడయాలో వైరల్ అవుతున్నాయి

న‌టుడు శివాజీ మాట్లాడుతూ.. "తెలంగాణ రూటెడ్ ఫిల్మ్ ఇది. నాకు డైరెక్ట‌ర్‌ గారు స్క్రిప్ట్ చె...