Hyderabad, జూన్ 28 -- హీరో సిద్ధార్థ్‌కు తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ క్రేజ్ ఉంది. బొమ్మరిల్లు, నువ్వు వస్తానంటే నేనొద్దంటానా, ఓయ్ తదితర సినిమాలతో ఎంతో పాపులర్ అయ్యాడు. ఇప్పుడు హీరో సిద్ధార్థ్ నటించిన లేటెస్ట్ మూవీ 3 బీహెచ్‌కే. సిద్ధార్థ్ తన కెరీర్‌లో 40వ సినిమాగా త్రీ బీహెచ్‌కే మూవీ తెరకెక్కింది.

3 బీహెచ్‌కే సినిమాకు శ్రీ గణేష్ దర్శకత్వం వహించారు. 3 బీహెచ్‌కే మూవీ ట్రైలర్‌ను జూన్ 27న విడుదల చేశారు. ఈ సందర్భంగా గ్రాండ్‌గా ఏర్పాటు చేసిన 3 బీహెచ్‌కే ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో సిద్ధార్థ్ ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పాడు. తన సొంతిల్లు కోసం ఎదురుచూడటంపై సిద్ధార్థ్ మాట్లాడాడు.

హీరో సిద్ధార్థ్ మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. 3 బీహెచ్‌కే మూవీ ఫ్యామిలీని మీకు పరిచయం చేయాలి. అరుణ్ విశ్వా ఎగ్జైటింగ్ ప్రొడ్యూసర్. ఈ సినిమా ఒక రియల్ లైఫ్ నుంచి వచ్చిన కథ...