భారతదేశం, డిసెంబర్ 23 -- బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ ముగిసిపోయింది. బిగ్ బాస్ తెలుగు 9 టైటిల్ విజేతగా కల్యాణ్ పడాల గెలిస్తే.. రన్నరప్‌గా సీరియల్ హీరోయిన్ తనూజ పుట్టస్వామి నిలిచింది. బిగ్ బాస్ అనంతరం టాప్ 5 ఫైనలిస్ట్‌లు బజ్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అయితే, దానికి సంబంధించిన ప్రోమోను, ఎపిసోడ్స్‌లను రోజుకొకటిగా విడుదల చేస్తున్నారు.

డిసెంబర్ 22న కల్యాణ్ పడాల బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ రాగా ఇవాళ (డిసెంబర్ 23) తనూజ గౌడ బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ బిగ్ బాస్ 9 తెలుగు బజ్ ఇంటర్వ్యూలో ది లేడి టైగర్ అంటూ తనూజ గౌడను ఆహ్వానించాడు హోస్ట్ శివాజీ. అలాగే, తనూజకు పులి బొమ్మ ఉన్న ట్రోఫీ కూడా అందించాడు శివాజీ.

"ఈ జర్నీ సాటిస్‌ఫైడ్ అమ్మా" అని శివాజీ అడిగితే.. "అవును, నవ్వాము. ఏడ్చాము. కోప్పడ్డాము. ఒకలాంటి బ్యూటిఫుల్ మిక్స్‌డ్ జర్నీ అంటే బిగ్...