భారతదేశం, డిసెంబర్ 24 -- 2029లో 80 శాతానికి పైగా సీట్లతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తాను రాజకీయాల్లో ఉన్నంతకాలం కల్వకుంట్ల కుటుంబాన్ని అధికారంలోకి రానివ్వనని కొడంగల్ కోస్గి సభలో శపథం చేశారు. సంపదలో వాటా ఇవ్వాల్సి వస్తుందనే సొంత బిడ్డను, అల్లుడిని వెల్లగొట్టారని తీవ్రమైన కామెంట్స్ చేశారు. కేటీఆర్‌పై కూడా తీవ్రంగా కామెంట్స్ చేశారు సీఎం.

'నేను ఉన్నంతకాలం కేసీఆర్‌కు అధికారం దక్కనివ్వను.. ఇదే నా శపథం. కల్వకుంట్ల కుటుంబాన్ని మళ్లీ అధికారంలోకి రానివ్వను. అసెంబ్లీ, పార్లమెంట్‌, ఉపఎన్నికలు.. అన్నింట్లోనూ ఓడించాం . పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను పాతరేశాం. ఇన్నిసార్లు ఓడించినా.. ఇంకా నాదే పైచేయి అంటారా?. 2029లో అధికారం ముమ్మాటికీ కాంగ్రెస్‌దే. రెండోసారి కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయం. కేసీఆర్‌ కోరినన్ని రోజ...