భారతదేశం, జనవరి 10 -- భారత టెస్ట్, వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మౌనం వీడాడు. టీ20 ప్రపంచ కప్ లో తలపడే ఇండియన్ స్క్వాడ్ కు ఎంపిక కాకపోవడంపై తొలిసారి రియాక్టయ్యాడు. ఆసియా కప్ 2025కి వైస్-కెప్టెన్‌గా టీ20 టీమ్ ప్లేయింగ్ ఎలెవన్లో అడుగుపెట్టిన 26 ఏళ్ల గిల్ 2025లో ఆఢిన 15 టీ20లలో ఒక్క ఫిఫ్టీ కూడా కొట్టలేక జట్టులో స్థానం కోల్పోయాడు.

టీ20 ప్రపంచకప్ స్నబ్‌పై అడిగినప్పుడు శుభ్‌మన్ గిల్ ఎక్కువ వివరాలను వెల్లడించడానికి నిరాకరించాడు. అతను ఎంపికైన జట్టుకు రాబోయే టోర్నమెంట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ''నా జీవితంలో నేను ఉండాల్సిన చోటే ఉన్నానని నేను నమ్ముతున్నా. నా విధిలో రాసిన ఏవైనా విషయాలు నా నుండి దూరం కావని అనుకుంటున్నా. స్పష్టంగా ఒక ఆటగాడిగా మీరు బాగా ఆడితే.. మీ జట్టు, మీ దేశం కోసం గెలుస్తారని మీకు ఒక నమ్మకం ఉంటుంది'' అని శనివారం (జనవరి 10) ప్రెస్ మ...