భారతదేశం, జనవరి 4 -- దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా 'ధురంధర్' సినిమా పేరే వినిపిస్తోంది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తూ 2025లోనే అత్యంత విజయవంతమైన చిత్రంగా అగ్రస్థానంలో నిలిచింది. కేవలం కథతోనే కాకుండా, ఈ సినిమాలోని పాటలు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

ముఖ్యంగా తెలుగు హీరోయిన్ అయేషా ఖాన్, క్రిస్టల్ డిసౌజా ఆదరగొట్టిన డాన్స్ నంబర్ 'శరారత్' చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. యూట్యూబ్‌లో ఈ సూపర్ హిట్ సాంగ్ శరారత్ ఏకంగా 100 మిలియన్ల వ్యూస్ మార్కును దాటింది. ఈ నేపథ్యంలోనే బ్యూటిఫుల్ అయేషా ఖాన్ తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు.

యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్ సాధించిన సందర్భంగా అయేషా ఖాన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఆత్మీయమైన నోట్ రాశారు. దురంధర్ సినిమాకు హౌజ్ ఫుల్ నిండిన థియేటర్‌లో ప్రేక్షకుల మధ్...